విగ్రహం ధ్వంసం.. నిందితులను అరెస్ట్ చేయాలి

మెదక్లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని రాజ్యాంగ హక్కుల సాధన సమితి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ కాశాపోగు ప్రసాద్ డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం, త్యాగాలను గుర్తు చేసుకోవాలని తెలిపారు. విగ్రహాన్ని ధ్వంసం చేసే ముందు ఆమె చరిత్ర, సమాజం కోసం చేసిన సేవలను తెలుసుకోవాలని అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


