← Back to news

మంగళగిరి ఆలయంలో దర్శనం మార్గం మార్పు

By BUJJIBABU· 1d ago· Guntur

గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడిలో శ్రీకృష్ణదేవరాయల ముఖ మండపం రిపేర్ పనులు జరుగుతున్నాయి. దీనివల్ల తూర్పు గాలిగోపురం వైపు నుంచి ఎంట్రీని తాత్కాలికంగా ఆపేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా దక్షిణ గాలిగోపురం మార్గం ద్వారా లోపలికి వెళ్లేందుకు అధికారులు చాన్స్ ఇచ్చారు. రిపేర్లు పూర్తయ్యే వరకు దక్షిణ గాలిగోపురం వైపు నుంచే దర్శనానికి వెళ్లాలని, ఆలయ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు.

More in Local