← Back to news

ఉత్తరాంధ్ర బీజేపీ జోనల్ ఇన్చార్జిగా పి.వి.జి. కృష్ణంరాజు

By Mohan· 1d ago· AP
ఉత్తరాంధ్ర బీజేపీ జోనల్ ఇన్చార్జిగా పి.వి.జి. కృష్ణంరాజు

భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్చార్జిగా సీనియర్ నాయకుడు పి.వి.జి. కృష్ణంరాజు నియామకమయ్యారు. BJP రాష్ట్ర అధ్యక్షుల కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చిన పార్టీ నాయకత్వానికి కృష్ణంరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్రలో పార్టీని మరింత బలోపేతం చేసి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని ఆయన చెప్పారు.

More in Local