పోలవరం పూర్తైతే భద్రాచలం టౌన్‌కు జలగండమే: హరీష్‌రావు

TG: పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే భద్రాచలం టౌన్‌కు నిత్యం జలగండమేనని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. భద్రాచలంలో పర్యటించిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులకు హరీశ్‌రావు లేఖ రాశారు. ఈ లేఖను పినపాక, భద్రాచలం బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. 2022లో 22లక్షల క్యూసెక్కులకే చాలా నష్టం జరిగిందని, భవిష్యత్తులో ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 36లక్షల నుంచి 50లక్షల క్యూసెక్కుల వరద వస్తే తెలంగాణకు ఊహించని ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. పోలవరం నిర్మాణంతో కేవలం ముంపు గ్రామాలకే కాకుండా పరిశ్రమలకు ముప్పు పొంచి ఉందన్నారు.


