← Back to news

సోలో డేట్స్‌ ట్రెండ్.. మీతో మీరే డేట్‌కి!

By A.Ajay· 9h ago
సోలో డేట్స్‌ ట్రెండ్.. మీతో మీరే డేట్‌కి!

ఈ మధ్య సోలో డేట్స్‌ ట్రెండ్‌గా మారుతున్నాయి. ఎవరితోనూ కాకుండా మనకు నచ్చిన పనిని మనమే చేసుకోవడం. ఒంటరిగా సినిమా చూడటం, కేఫ్‌కు వెళ్లడం, షాపింగ్‌, లాంగ్ డ్రైవ్‌ లేదా ట్రిప్‌కు వెళ్లడం వంటివి ఇందులో ఉంటాయి. ఇలా కొంత టైం మనతో మనం గడపడం వల్ల మనకు నచ్చిన విషయాలు తెలుసుకోవడంతో పాటు సొంత నిర్ణయాలు తీసుకునే ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒంటరిగా ఉండటం అంటే ఒంటరితనం కాదని ఈ ట్రెండ్ చెబుతోంది.

More in Viral