బస్తాలో నుంచి చెయ్యి బయటకు.. హత్య గుట్టు రట్టు

మృతదేహాన్ని బస్తాలో కట్టి పల్సర్ బైక్‌పై తరలిస్తుండగా పెట్రోల్ బంక్ వద్ద చెయ్యి బయటపడటంతో విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపల్లిలో జరిగిన హత్య వెలుగులోకి వచ్చింది. శీల రమా, లంకపల్లి బంగారిబాబుకు నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా మనస్పర్థలతో రమా అతడికి దూరంగా ఉంటోంది. ఆమెను ఇంటికి పిలిపించిన బంగారిబాబు, ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రమా గొంతు నులిమి హత్య చేసినట్లు, బంగారిబాబును అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.



