← Back to news

ఆటో బోల్తా.. పత్తి కూలీలకు గాయాలు!

By శ్రీనివాస్ నాగర్ కర్నూల్· 7h ago· Kalwakurthy (Ct), Kalwakurthy, Nagarkurnool

నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ సమీపంలో పత్తి కూలీలతో వెళ్తున్న ఆటో బుధవారం ఉదయం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More in Local