కేంద్ర పదవికి ఎల్.మురుగన్ రాజీనామా

కేంద్ర సహాయ మంత్రి (సమాచార ప్రసార శాఖ), రాజ్యసభ ఎంపీ ఎల్.మురుగన్ తన పదవులకు రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి రాజీనామా ఇచ్చారు. తమిళనాడులో BJPని బలోపేతం చేయడానికి పూర్తి టైం కేటాయించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రాబోయే 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.



