తల్లిని గెంటేసిన కొడుకులు.. అండగా నిలిచిన DSP

కొడుకుల వేధింపులతో ఇబ్బందులు పడుతున్న 85 ఏళ్ల వృద్ధురాలికి మిర్యాలగూడ DSP రవి అండగా నిలిచారు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం నారాయణపురానికి చెందిన నెమలి రామనర్సమ్మ తన పెద్ద కొడుకు లింగారెడ్డి, కోడలు యాదమ్మ బంగారం, రూ.30 వేల నగదు తీసుకుని ఇంటి నుంచి బయటకు పంపించారని ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ B.చంద్రశేఖర్, SP శరత్ చంద్ర పవార్‌ను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న DSP రవి గ్రామానికి వెళ్లి వృద్ధురాలిని పరామర్శించి 25 కేజీల బియ్యం, పండ్లు అందించారు.



