జడ్చర్లలో 200 మందికి అన్నదానం

జడ్చర్ల మున్సిపాలిటీ 4వ వార్డు మూసా కాంపౌండ్‌లోని గణపతికి కాలనీవాళ్లు పూజలు చేశారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా స్థానిక BRS నాయకుడు పెద్ది వెంకటేష్ ఆధ్వర్యంలో దాదాపు 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ గత 30 ఏళ్లుగా వినాయక చవితి వేడుకలను జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు.




