వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

వినాయక నిమజ్జనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని యాదాద్రిభువనగిరి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు. భువనగిరి పట్టణ శివారులోని పెద్దచెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. చెరువులో నీటిమట్టం అధికంగా ఉన్నందున భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భారీకేడింగ్ ఏర్పాటు చేయడంతో పాటు క్రేన్లు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య సిబ్బంది, తాగునీరు, వైద్య సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.



