జడ్చర్ల వద్ద రామచందర్రావు అరెస్ట్

జూరాల ప్రాజెక్టు వద్ద నీటి కోసం ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావును మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న నాయకుడిని మార్గమధ్యంలో అడ్డుకోవడం అప్రజాస్వామికమని బీజేపీ నాయకులు విమర్శించారు. రైతుల సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని, అన్నదాతల పక్షాన పార్టీ నిలబడుతుందని నాయకులు పేర్కొన్నారు.



