పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకం

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గుడివాడ జడ్పీ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. పాఠశాల అభివృద్ధి కమిటీ ఎన్నికలు నిర్వహించారు. కలెక్టర్ నిషాంతి హాజరై విద్యార్థుల భవిష్యత్తులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. సావిత్రి చైర్మన్‌గా, పాంగి కృష్ణ వైస్‌చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో డీఈఓ భానుమూర్తిరాజు, ఎంఈఓ పాల్గొన్నారు.


