ప్రమాదం జరగకముందే స్పందించాలి

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలోని తుమ్మలపల్లి స్థానిక ప్రభుత్వ పాఠశాల వెనకాల ప్రధాన రహదారి పక్కన ఉన్న కరెంట్ స్తంభానికి పిచ్చి మొక్కలు అల్లుకుని పెరుగుతున్నాయి. మొక్కలు విద్యుత్ తీగలకు సమీపంగా విస్తరించడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి మొక్కలను తొలగించడంతో పాటు విద్యుత్ లైన్లను పరిశీలించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


