← Back to news

జగన్ నివాసం వద్ద వెటర్నరీ డాక్టర్ల ఆందోళన

By BUJJIBABU· 1d ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur

తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ నివాసం వద్ద నిరుద్యోగ వెటర్నరీ డాక్టర్లు సోమవారం ఆందోళన చేశారు. 164 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రచారాన్ని నిరసిస్తూ జగన్ నివాసాన్ని ముట్టడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. జీఓ నంబర్ 52 నిబంధనల ప్రకారం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

More in Local