పిడుగుపాటు మృతి కుటుంబాన్ని ఆదుకోవాలి

ఖమ్మం జిల్లాలోని వేంసూరు మండలం లచ్చన్నగూడెం గ్రామంలో భారీ వర్షానికి పిడుగు పడి పొలంలో మృతి చెందిన పర్సా ఆనందరావు కుటుంబాన్ని ఆదుకోవాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. ప్రకృతి విపత్తుల చట్టం కింద తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఆనందరావు కుటుంబాన్ని కలిసి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నివాళులు అర్పించారు. ముగ్గురు ఆడబిడ్డల తండ్రి అకాల మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.



