అన్నపూర్ణ దేవి భక్తులకు దర్శనం

మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంతో పాటు వాడ్యాల, మల్లాపూర్, వేముల, మసిగుండ్లపల్లి, దోనూర్, బైరంపల్లి గ్రామాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, సహస్రనామ పారాయణాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.


