← Back to news

నేరాల కట్టడిపై సీపీ ఉన్నతస్థాయి సమీక్ష

By DK· 8h ago
నేరాల కట్టడిపై సీపీ ఉన్నతస్థాయి సమీక్ష

ఖమ్మం జిల్లాలో గంజాయి, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీపీ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. గంజాయి వినియోగం, విక్రయాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచాలని, సరఫరా చేస్తున్న ప్రధాన వ్యక్తుల నెట్‌వర్క్‌ను ఛేదించాలని సూచించారు. సైబర్ మోసాలపై ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి, బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో బాధితుల నగదును ఫ్రీజ్ చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

More in Local