← Back to news

భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

By BK· 10 Oct 2026· వరంగల్

వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దసరా నవరాత్రులకు ముందు వచ్చే అమావాస్య రోజున అమ్మవారికి స్పెషల్‌గా నిర్వహించే పసుపు అభిషేకాన్ని అర్చకులు పూర్తిచేశారు. ప్రధాన అర్చకులు శేషు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు ఆలయానికి క్యూ కడుతున్నారు.

More in TG