మీరు మమ్మల్ని ఆపలేరు: ప్రకాష్ రాజ్

దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత చేపట్టిన నిరసనలకు మద్దతుగా నటుడు ప్రకాష్‌రాజ్ 'X' అకౌంట్‌లో పోస్ట్ చేశారు. పోలీసుల ఆంక్షలు, అణచివేతలను నిరసిస్తూ ‘మీరు మమ్మల్ని ఆపలేరు. ఈ పోరాటం కొనసాగుతుంది’ అని రాశారు. పరీక్షల లీకేజీలు, యువత భవిష్యత్తుపై ప్రశ్నిస్తూ #justasking హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన ఈ నిరసనలో భాగమయ్యారు. ఎంత అణచివేస్తే అంతగా తిరగబడతామని, ప్రజాస్వామ్యంలో యువత హక్కుల కోసం చేసే పోరాటం ఆగదని చెప్పారు.




