వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లను హైకోర్టు కొట్టివేత

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పురపాలక సంఘాల వార్డుల పునర్విభజనపై దాఖలైన 50 పిటిషన్లను గురువారం కొట్టివేసింది. వార్డుల విభజన సరికాదంటూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించగా, చట్ట నిబంధనల మేరకే చేస్తున్నామని ప్రభుత్వం వాదించింది. ఇరువర్గాల వాదనలు పూర్తయిన నేపథ్యంలో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన వార్డుల ప్రకారం స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.



