← Back to news

పెదనందిపాడు, కాకుమానులో కరువు పరిస్థితులు

By DK· 19h ago
పెదనందిపాడు, కాకుమానులో కరువు పరిస్థితులు

వర్షాభావంతో పంటల సాగు దెబ్బతిన్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు, కాకుమాను మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. పెదనందిపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి తహసీల్దార్ కె.కళ్యాణికి వినతిపత్రం అందించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు పాశం రామారావు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రెండు మండలాల్లో పది శాతం కూడా పంటల సాగు జరగలేదన్నారు.

More in Local