పేద విద్యార్థికి అండగా మాజీ ఎమ్మెల్యే

TG : నాగర్‌కర్నూల్ జిల్లా ఎండబెట్ల గ్రామానికి చెందిన రేవతి అనే అమ్మాయికి బి.పీ.ఎడ్ కోర్సులో సీటు వచ్చింది కానీ, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఫీజు కట్టడం కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వెంటనే రెస్పాండ్ అయ్యారు. రేవతి మొదటి సంవత్సరం ఫీజు కోసం తన సొంత నిధుల నుంచి రూ. 32,000 చెక్కును అందజేసి సపోర్ట్‌గా నిలిచారు. పేదరికం వల్ల ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదని, రేవతి కోర్సు పూర్తయ్యే వరకు పూర్తి హెల్ప్ అందిస్తూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

