← Back to news

ఈ రాజాలిద్దరిదీ అపూర్వ సహోదర బంధం !

By DS· 11 Jun 2026· Mumbai
ఈ రాజాలిద్దరిదీ అపూర్వ సహోదర బంధం !

భారతీ రాజా, ఇళయ రాజాలది అపూర్వ స్నేహ బంధం.. అది చాలా ఆత్మీయ బంధం.. ఒకరిలో ఒకరు మమేకమైపోయే బంధం. ఇళయరాజా మద్రాస్ వచ్చిన కొత్తలో రూమ్ లేక ఇబ్బంది పడుతుంటే భారతీ రాజా ఏకంగా ఒక ఔట్ హౌస్ అద్దెకు తీసుకుని అందులో ఇళయ రాజాను ఉంచాడు. ఇళయ రాజా మ్యూజికల్ అక్విప్ మెంట్ ను జాగ్రత్త చేసుకోడానికి తన సొంత రూమ్ లో కొంత ప్లేస్ ఇచ్చాడు. అంతేకాదు ఇద్దరూ ఒకే ప్లేట్ లో తిన్నారు ఒకే మంచంలో పడుకున్నారు కూడా. వారి మధ్య కేవలం ప్రొఫెషనల్ రిలేషనే కాదు.. అంతకుమించిన అనుబంధం ఉంది. మొదట్లో తిండి కష్టాల నుంచి సినిమా కష్టాల వరకూ చాలానే ఉన్నాయ్ ఇద్దరి మధ్యా!

More in Cinema