← Back to news

బెంగాల్ లో బీజేపీ బూత్ మేనేజ్ మెంట్ ఇలా..

By aravinda nyayapati· 4 May 2026· Kolkata
బెంగాల్ లో బీజేపీ బూత్ మేనేజ్ మెంట్ ఇలా..

బెంగాల్ ఎన్నికల్లో BJP, RSS బూత్ లెవల్లో అలుపెరగకుండా పని చేశారు. 80 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలుంటే ప్రతీ బూత్ కి 'సప్తర్షి' పేరుతో ఏడుగురు సభ్యులతో కమిటీలు వేశారు. ఓటర్ల జాబితాలో ప్రతీ పేజీకి ఒక పన్నా ప్రముఖ్ నియమించారు. వీరు 10-15 కుటుంబాల బాధ్యత తీసుకున్నారు. 2011లో బెంగాల్‌లో సుమారు 500 ఉన్న ఆరెస్సెస్ శాఖలు, 2026 నాటికి 2,500 కి పెరిగాయి. వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ద్వారా జంగల్ మహల్ లో , సరస్వతి శిశు మందిరాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరెస్సెస్ బలమైన పునాది వేసింది. ప్రతి బూత్‌కు ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి, స్థానిక సమస్యలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.

More in Politics