తెలంగాణ యోధుడు బాపూజీకి నివాళి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి నిర్వహించారు. బాపూజీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి నాంది పలికిన పోరాట యోధుడు బాపూజీ అని AIAYS జిల్లా అధ్యక్షుడు మూగ ప్రభాకర్ అన్నారు. మలిదశలో 90 ఏళ్ల వయసులో ఢిల్లీలో ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాపు రాజన్న, తిరుపతి నాయి, సురేష్ వాగ్మేరే, ఎం.మాలజీ తదితరులు పాల్గొన్నారు.



