← Back to news

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కస్టడీ!

By Krishna· 7h ago
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కస్టడీ!

TG: బొల్లారంలో మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్‌ని పోలీసులు 7 రోజుల కస్టడీకి తీసుకునేందుకు సికింద్రాబాద్ కోర్టు అనుమతించింది. సెప్టెంబర్ 15 నుంచి వారం రోజుల పాటు పోలీసులు ఆయన్ని ప్రశ్నించనున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీ లోకి తీసుకుని, చోరీ వెనుక ఉన్న కారణాలు, లోపలి వ్యక్తుల సహకారం, నెట్‌వర్క్ వివరాలపై ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఆయుధాలన్నీ రికవరీ అయ్యాయి. దర్యాప్తు కొనసాగుతోంది.

More in TG