← Back to news

కంటైనర్ లారీలో భారీగా గంజాయి స్మగ్లింగ్

By Nani Eluri· 17h ago· X
కంటైనర్ లారీలో భారీగా గంజాయి స్మగ్లింగ్

TG: అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. NH-16పై కశింకోట సమీపంలోని HOP హోటల్ దగ్గర EAGLE టీమ్, కశింకోట పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఓ కంటైనర్ లారీని ఆపారు. అందులో ఉన్న ఇద్దరు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేసి, ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 70 లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం. గంజాయిని ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే దానిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

More in AP