రిజర్వేషన్లతో మారనున్న రాజకీయ సమీకరణాలు

ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో 2026 ఎన్నికల నేపథ్యంలో 40 వార్డుల రిజర్వేషన్ల జాబితా విడుదలైంది. ఇందులో 11 వార్డులు అన్రిజర్వుడ్, 9 మహిళా జనరల్, 6 బీసీ జనరల్, 5 బీసీ మహిళ, 4 ఎస్సీ జనరల్, 3 ఎస్సీ మహిళ, ఒకటి ఎస్టీ జనరల్, మరోటి ఎస్టీ మహిళకు కేటాయించారు. రిజర్వేషన్ల జాబితా విడుదల కావడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమ వార్డుల కేటాయింపులపై దృష్టి సారిస్తున్నారు.


