పిడుగుపడి 15 గొర్రెలు మృతి
జగిత్యాల జిల్లా రామారావుపల్లిలో చిలువేరి మహేష్ అనే వ్యక్తికి చెందిన గొర్రెల మందపై పిడుగు పడటంతో సుమారు 15 గొర్రెలు అక్కడికక్కడే చనిపోయాయి. దీనివల్ల దాదాపు 2 లక్షల రూపాయిల వరకు నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన చెందాడు. గవర్నమెంట్ స్పందించి తనకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.



