లాయర్లపై సీరియస్ అయిన CJI

జంతర్ మంతర్ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో సీరియస్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ధర్నాలు చేయడానికి ఫిజికల్ ప్రెజెన్స్ అవసరమని, అప్పుడే తమ వాయిస్ వినిపిస్తుందని లాయర్ ముక్తా గుప్తా వాదించగా.. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ‘వాయిస్ వినిపించడం’ అనే పదానికి అర్థం మారిందేమోనని జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీ ప్రశ్నించారు. ఈ క్రమంలో బెంచ్ మాట్లాడుతుండగా లాయర్లు అడ్డుపడటంపై CJI సూర్యకాంత్ సీరియస్ అయ్యారు. ఢిల్లీ కొందరి సొత్తు కాదని లాయర్లు వాదించారు.


