ద్రువ్ రాఠీకి కోర్టు సమన్లు

ప్రముఖ యూట్యూబర్ ద్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. 2018లో ‘BJP IT Cell Part-2’ పేరుతో ఆయన పోస్ట్ చేసిన వీడియోపై BJP IT Cell సభ్యుడు వికాస్ పాండే పరువు నష్టం కేసు వేశారు. వీడియోలో తనపై చేసిన ఆరోపణలు పరువుకు భంగం కలిగించాయని కంప్లయింట్ చేశారు. గతంలో ధ్రువ్ రాఠీ విదేశాల్లో ఉండటంతో సమన్లు అందలేదు. ప్రస్తుతం ఆయన భారత్లో ఉండటంతో గురుగ్రామ్ అడ్రెస్కి సమన్లు పంపాలని కోర్టు ఆదేశించింది. తరువాత విచారణ ఈనెల 17న జరగనుంది.



