← Back to news

ప్రశాంత ఎన్నికలకు ప్రజలు సహకరించాలి: సీఐ

By Mohan· 13h ago· Rajam, Rajam, Vizianagaram
ప్రశాంత ఎన్నికలకు ప్రజలు సహకరించాలి: సీఐ

విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గోళ్లవలస గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజాం రూరల్ పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ ఉపేంద్ర మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. డబ్బు, మద్యం పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని సూచించారు.

More in Local