ధారకొండ–గంగవరం రోడ్డు.. ప్రమాదకరం!
భారీ వర్షాలతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గూడెం కొత్త వీధిలోని ధారకొండ–గంగవరం రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై వర్షపు నీరు చేరింది. ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ప్రయాణికులు చెబుతున్నారు. వెళ్లి తిరిగి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.


