← Back to news

ప్రేమ పేరుతో నమ్మించి.. పోక్సో కేసు

By Bala· 1h ago
ప్రేమ పేరుతో నమ్మించి.. పోక్సో కేసు

జోగులాంబ గద్వాల జిల్లాలో ఇంటర్ చదువుతున్న బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దోపిడీకి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలుకు చెందిన యువకుడికి అలంపూర్‌లో స్నేహితుడు ఉండటంతో అక్కడికి తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో బాలికతో పరిచయం పెంచుకుని ఆమెను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక గర్భవతి అని తేలడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

More in Local