← Back to news

4.5 కోట్ల కరెన్సీతో అమలాపురంలో అమ్మవారి అలంకరణ!

By Nani Eluri· 23h ago· X

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు కరెన్సీ నోట్ల అలంకరణలో దర్శనమిస్తున్నారు. దేవి నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారిని అలంకరించారు. ఆలయం మొత్తం కొత్త కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించారు. ఆలయ కమిటీ చేసిన ఈ అలంకరణ కోసం మొత్తం 4 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన కరెన్సీని ఉపయోగించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా ఆలయానికి వస్తున్నారు.

More in AP