← Back to news

కోనరావుపేటలో ఉచిత వైద్య శిబిరం

By Pinjari Shiva Kumar· 5h ago· Jagitial
కోనరావుపేటలో ఉచిత వైద్య శిబిరం

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం కోనరావుపేటలో మండల వైద్యాధికారి డాక్టర్ ఎల్లాల అంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు బీపీ, షుగర్ తదితర NCD పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ అంజిత్ రెడ్డి సూచించారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, జ్వరం, దగ్గు లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులను తొలిదశలో గుర్తిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు.

More in Local