జూరాలలో టెన్షన్.. అరెస్టులపై KTR ఫైర్
TG: జూరాల ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఉమ్మడి పాలమూరు జిల్లా BRS నేతలు, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వందల మంది రైతులను రేవంత్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని KTR ఆరోపించారు. జూరాలలో 9 TMCల నీరు ఉన్నా కూడా విడుదల చేయకుండా పంటలు ఎండిపోయేలా చేస్తున్నారనీ, తాగునీటికి 2 TMCలు సరిపోతాయని ఆయన విమర్శించారు. రైతులనూ, నేతలనూ విడుదల చేసి వెంటనే సాగునీరు ఇవ్వాలని KTR డిమాండ్ చేశారు.


