బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్ చేయూత

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం రాస్నం గ్రామంలో విద్యుత్ షార్ట్సర్క్యూట్తో కుమ్మరి బుచ్చమ్మ ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంటి వస్తువులు, దాచుకున్న నగదు కాలిపోవడంతో సుమారు ₹.50వేల ఆస్తి నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసర వస్తువులు అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఫౌండేషన్ ప్రతినిధులు అక్బర్ బాబా, ప్రకాశ్ గౌడ్ తెలిపారు.


