← Back to news

ఎన్నికల కౌంట్‌డౌన్.. నామినేషన్ల ప్రారంభం!

By Prashanth· 1d ago
ఎన్నికల కౌంట్‌డౌన్.. నామినేషన్ల ప్రారంభం!

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈరోజు నుండి ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లో ఈ నెల 18 వరకు నామినేషన్లు తీసుకుంటారు. 19న నామినేషన్ల పరిశీలన, 21న ఉపసంహరణ, అదే రోజు ఫైనల్ అభ్యర్థులను ప్రకటిస్తారు. 28న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు. దీంతో పట్టణాల్లో ఎన్నికల సందడి మొదలైంది, రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై దృష్టి పెట్టాయి.

More in AP