← Back to news

బీజేపీ జిల్లా కార్యదర్శి అరెస్ట్

By malluru chandrashekar· 2h ago· Sathupalli, Sathupalli, Khammam
బీజేపీ జిల్లా కార్యదర్శి అరెస్ట్

TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో “ఫీజు బకాయి బీజేపీ లడాయి” కార్యక్రమానికి వెళ్లకుండా బీజేపీ జిల్లా కార్యదర్శి పాలా నాగ సురేంద్ర రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీనిపై పాలా నాగ సురేంద్ర రెడ్డి స్పందిస్తూ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు అరెస్టులకు, కేసులకు భయపడరని స్పష్టం చేశారు.

More in Local