చారకొండలో బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

TG: నాగర్ కర్నూల్ జిల్లా చారకొండలో చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివెళ్తున్న బీజేపీ, BJYM నాయకులను పోలీసులు సోమవారం ఉదయం ముందస్తుగా అరెస్ట్ చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా నాయకుడు చంద్రారెడ్డి, మండల నాయకులు వెంకటేష్ చారి, శ్రీకాంత్, హరిబాబు తదితరులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడంపై బీజేపీ నాయకులు పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.



