విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతుల వంట వార్పు

పంటలు ఎండిపోతున్నాయని, వ్యవసాయానికి సకాలంలో విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి మండలం చందాపూర్లో రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. చందాపూర్ విద్యుత్ ఉపకేంద్రం ఎదుట చందాపూర్, దత్తాయపల్లి, దత్తాయపల్లి పెద్దతండ, పానల్ మండలం మల్లాయపల్లి తదితర గ్రామాల రైతులు వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. 12 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే కరెంట్ ఉంటోందని రైతులు తెలిపారు. అంతరాయాలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.



