సంజయ్ గాంధీ నగర్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం

పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపాలిటీకి రూ.25 కోట్ల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. ఈ నిధులతో పట్టణంలోని అన్ని వార్డుల్లో దశలవారీగా మౌలిక వసతుల పనులు చేపడతామని చెప్పారు. ఇందులో భాగంగా సంజయ్ గాంధీ నగర్‌లో రూ.35 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.



