రష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులు.. రప్పించాలి!

ఉపాధి పేరుతో రష్యా వెళ్లి మిలిటరీ క్యాంపుల్లో చిక్కుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణకు చెందిన నలుగురు యువకులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని BRS రాష్ట్ర సహాయ కార్యదర్శి ఊడుగుల ఐలయ్య యాదవ్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కుటుంబాల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని రష్యా ప్రభుత్వంతో దౌత్యపరంగా మాట్లాడి యువకుల క్షేమం నిర్ధారించాలని తెలిపారు.



