← Back to news

ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించిన గంటా శ్రీనివాసరావు

By DK· 20h ago
ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించిన గంటా శ్రీనివాసరావు

విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో ఆరోగ్య, విద్యా రంగాలకు సంబంధించిన అభివృద్ధి పనులను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. రూ.77 లక్షలతో నిర్మించిన పబ్లిక్ హెల్త్ యూనిట్, విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించారు. ఆస్పత్రుల్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఆనందపురం ఎంపీపీ మోడల్ స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. పాఠశాల భవనం పెచ్చులూడిన విషయాన్ని గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.

More in Local