← Back to news

ఆ భూములపై కవిత ఆరోపణలు

By A.Ajay· 2h ago

TG: రంగారెడ్డి జిల్లా.. కొంగరకుర్దు (A) గ్రామంలోని 580 ఎకరాల వక్ఫ్‌ భూములపై TRS అధ్యక్షురాలు కవిత ఆరోపణలు చేశారు. ఈ భూముల్లో సుమారు 150 ఎకరాలు.. భూ మాఫియా చేతుల్లోకి వెళ్లాయని ఆమె అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఎలా రిజిస్ట్రేషన్‌ అయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అక్కడ చేపట్టిన వెంచర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్లు రద్దు చేయకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.

More in TG