గూగుల్ డేటా సెంటర్ భూమిపై హైకోర్టులో కేసు

AP:వైజాగ్ గూగుల్ డేటా సెంటర్‌కు 160 ఎకరాల ఆలయ భూమి కేటాయింపుపై పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో కంప్లయింట్ చేశారు. దీనిపై APIIC హైకోర్టుకు వివరణ ఇచ్చింది. ప్రాజెక్ట్, భూమి కేటాయింపును SIPC, SIPB, మంత్రివర్గం ఆమోదించాయని తెలిపింది. భూమి యాజమాన్యం ఎండోమెంట్స్ శాఖదేనని పేర్కొంది. ఏడాదికి 26.45 కోట్ల లీజు చెల్లిస్తున్నట్లు తెలిపింది. కేసు తదుపరి విచారణ అక్టోబర్ 5న జరగనుంది.

