దారుణం.. దగ్ధమైన రెండు లారీలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి వస్తున్న లారీ, నిలిపి ఉన్న మరో లారీని ఢీకొనడంతో మంటలు చెలరేగి రెండు లారీలు దగ్ధమయ్యాయి. లారీల్లో ఉన్నవారు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



