యుద్ధ విరమణకు ఇరాన్ కౌంటర్ ప్రపోజల్ !

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ఇంతకుముందు చేసిన ప్రతిపాదనకు 14 పాయింట్లతో కౌంటర్ ప్రతిపాదన చేసింది. పాకిస్థాన్ ద్వారా అమెరికాకు ఈ ప్రతిపాదనను ఇరాన్ పంపింది. ఇందులో 30 రోజుల్లోగా అన్ని సమస్యలను పరిష్కరించుకుని యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని ఇరాన్ పిలుపునిచ్చింది. అయితే ఇరాన్ మళ్లీ తప్పుగా ప్రవర్తిస్తే సైనిక దాడులు తిరిగి ప్రారంభమవుతాయని ట్రంప్ హెచ్చరించారు..
